Index

కీర్తనల గ్రంథము - Chapter 64

1 దేవా, నేను మొఱ్ఱపెట్టగా నా మనవి ఆలకింపుము శత్రుభయమునుండి నా ప్రాణమును కాపాడుము. 
2 కీడుచేయువారి కుట్రనుండి దుష్టక్రియలు చేయువారి అల్లరినుండి నన్ను దాచుము 
3 ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుక లకు పదును పెట్టుదురు. 
4 యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదుమాటలను బాణములుగా సంధించుదురు.వారు భయమేమియు లేక అకస్మాత్తుగా వారినికొట్టెదరు 
5 వారు దురాలోచన దృఢపరచుకొందురు చాటుగా ఉరుల నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. 
6 వారు దుష్టక్రియలను తెలిసికొనుటకు ప్రయత్నిం తురు వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు ప్రతివాని హృదయాంతరంగము అగాధము. 
7 దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. 
8 వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచువారందరు తల ఊచుదురు 
9 మనుష్యులందరు భయముకలిగి దేవుని కార్య ములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించు కొందురు 
10 నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు యథార్థహృదయులందరు అతిశయిల్లుదురు.