Index

కీర్తనల గ్రంథము - Chapter 14

1 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయ ములో అనుకొందురు.వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు.మేలుచేయు వాడొకడును లేడు. 
2 వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అనియెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరి శీలించెను 
3 వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారుమేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు 
4 యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచుపాపము చేయువారికందరికిని తెలివి లేదా?పాపము చేయువారు బహుగా భయపడుదురు. 
5 ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్ష మున నున్నాడు 
6 బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యెహోవా వారికి ఆశ్రయమై యున్నాడు. 
7 సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక.యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును.