Index

కీర్తనల గ్రంథము - Chapter 11

1 యెహోవా శరణుజొచ్చియున్నానుపక్షివలె, నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట యేల? 
2 దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారుచీకటిలో యథార్థహృదయులమీద వేయుటకైతమ బాణములు నారియందు సంధించి యున్నారు 
3 పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? 
4 యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడుయెహోవా సింహాసనము ఆకాశమందున్నదిఆయన నరులను కన్నులార చూచుచున్నాడుతన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. 
5 యెహోవా నీతిమంతులను పరిశీలించునుదుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు, 
6 దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియువారికి పానీయభాగమగును. 
7 యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించు వాడుయథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు.