Index

కీర్తనల గ్రంథము - Chapter 124

1 మనుష్యులు మనమీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడైయుండనియెడల 
2 వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు 
3 యెహోవా మనకు తోడైయుండనియెడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు 
4 జలములు మనలను ముంచివేసి యుండును ప్రవాహము మన ప్రాణములమీదుగా పొర్లిపారి యుండును 
5 ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణములమీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురు గాక. 
6 వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందును గాక. 
7 పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరినుండి తప్పించుకొని యున్నది ఉరి తెంపబడెను మనము తప్పించుకొని యున్నాము. 
8 భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.