Index

కీర్తనల గ్రంథము - Chapter 128

1 యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు. 
2 నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించె దవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును. 
3 నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు. 
4 యెహోవాయందు భయభక్తులుగలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. 
5 సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు 
6 నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.