Prayers

పునీత బెర్నార్డ్ దేవమాతను జూచి వేడుకొనిన జపము
మిక్కిలి నెనరుగల తల్లీ,మీ శరణుగోరి పరిగెత్తి వచ్చి మీ యుపకార సహాయములను బ్రతిమాలి,మీ వేడుకోలు సహాయమును అడిగినవారలయందు ఒక్కరైనను మీ వలన చేయి విడువబడినట్టు ఎన్నడును లోకములో వినినది లేదని తలంప నవధరించండి. కన్యకల రాజ్ఞీయైన కన్యకా! కరుణారసముగల తల్లీ! ఇటువంటి నమ్మికచేత ప్రేరేపింపబడి,మీ దివ్య పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చేచు పాపినైనా నేను మీ దయాళుత్వమునకు కాచుకొని, మీ సముఖములో నిలుచుచున్నాను. అవతరించిన వార్తయొక్క తల్లీ! నా విజ్ఞాపనమును త్యజింపక దయపరివై నిన్న విన నవధరించండి.
జన్మపాపము లేక ఉద్భవించిన పవిత్ర మరియమ్మా! పాపులకు శరణమా! ఇదిగో పరుగెత్తివచ్చి, మీ శరణుజొచ్చితిమి.
మా మీద నెనరుగా నుండి. మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. (ఇట్లు మూడు సార్లు చెప్పి 1పర. 1మం. త్రీత్వ. )