Prayers
దివ్య కారుణ్య జపమాల
(మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన)
ప్రారంభము: సిలువ గురుతు, పరలోక జపము, మంగళ వార్త జపము, విశ్వాస సంగ్రహము
(ప్రతి దేవా రహస్యము ప్రారంభించుటకు ముందు పెద్ద పూస వద్ద ఈ క్రింది జపము చెప్పవలెను)
నిత్యుడగు పితయైన సర్వేశ్వరా! మీ డివ్య కుమారుడును, మా నాథుడైన యేసుక్రీస్తు శరీర రక్తములను, ఆత్మను, దైవ స్వభావమును , మా పాపముల, ప్రపంచములోని మానవులందరి పాపముల పరిహార్దము మీకు సమర్పించుచున్నాము. ఆమెన్.
(ప్రతి దేవరహస్యము యొక్క పది చిన్న పూసలపై ఈ క్రింది జపము చెప్పవలెను)
యేసునాథుని అతి బాధాకరమైన శ్రమలను చూచి మా మీదను, ప్రపంచములోని మానవులందరి మీదను మీ కరుణను చూపండి.
(ఐదు దేవా రహస్యములైన పిమ్మట ఈ ప్రార్థనతో ముగించవలెను)
పవిత్ర దేవా, పవిత్ర సర్వశక్తిమంతుడా, పవిత్ర నిత్యుడా! మా మీదను, ప్రపంచ మానవులందరి మీదను మీ కరుణను చూపండి. (మూడు సార్లు చెప్పవలెను)
అందరు: యేసు తిరుహృదయము నుండి ప్రవహించు దివ్య రక్తమా! జీవజాలమా! మిమ్ము ఆరాధిస్తున్నాను. (మూడు సార్లు)
Prayers
- స్లీవ గురుతు
- పరలోక జపము
- మంగళ వార్త జపము
- త్రీత్వ స్తోత్రము
- ఫాతిమా ప్రార్ధన
- విశ్వాస సంగ్రహము
- ఉత్తమ మనస్తాప జపము
- సర్వేశ్వరుని ఆజ్ఞలు పది
- తిరుసభ కట్టడాలు - ఆరు
- విశ్వాస జపము
- నమ్మిక జపము
- దేవ ప్రేమ జపము
- సంతోష దేవ రహస్యములు
- దుఃఖః దేవ రహస్యములు
- మహిమ దేవ రహస్యములు
- ప్రకాశిత దేవ రహస్యములు
- కృపా రసముగల మాతా
- దేవమాత ప్రార్థన
- పునీత బెర్నార్డ్ దేవమాతను జూచి వేడుకొనిన జపము
- విశాఖపురి మేరీమాత నవదిన జపము
- ఉదయకాల సమర్పణ
- త్రికాల జపము
- పాస్క త్రికాల జపము
- జేసునాధుని దివ్యనామ ప్రార్థన
- రాత్రి కాల జపము
- పరిశుద్ధ స్లీవమార్గము
- జపమాల
- భోజనమునకు ముందు జపము
- భోజనమునకు పిమ్మట జపము
- పరిశుద్ధ కుటుంబ జపము
- పునీత అంతోనీ వారికి జపము
- దివ్య కారుణ్య జపమాల
- నీషేయా విశ్వాస సంగ్రహము