Prayers

నీషేయా విశ్వాస సంగ్రహము

ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతడు పరలోకమును, భూలోకమును, కనుపించు, కనుపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పీత, సర్వేశ్వరుని జనితైక పుత్రుడను, ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పీతనుండి జన్మించెను.. దేవుని నుండుడి దేవునిగాను, జ్యోతినుండి జ్యోతిగాను, నిజదేవుని నుండి నిజదేవుని గాను జన్మించెను. జన్మించినవాడు, సృష్టింపబడినవాడు కాడు. పితతో నేకస్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడేను. మానవులమగు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను. (ఈ క్రింది వాక్యమును శిరము వంచి చెప్పుదురు) పవిత్రాత్మ ప్రభావము వలన కన్యమరియమ్మ ద్వారా, శరీరము ధరించి మానవుడాయెను. మన కొరకు ఫోన్సు పిలాతునీ క్రింద, సిలువ మీద కొట్టబడి, మరణము పొంది సమాధిచేయబడెను. పవిత్ర గ్రంధములో ఉన్నట్లు, మూడవ రోజున మరల జీవిముతో లేచెను. పరలోకమునాకు ఆరోహణమై పీత కుడి ప్రక్కన కూర్చొనియున్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరల మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే వుండదు. పితపుత్రుల నుండి బయలుదేరేడు ప్రభువును, జీవనదాతయునైన పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పీత పుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తలద్వారా బోధించుయున్నాడు. ఏక, పవిత్ర, కథోలిక, అపోస్తలిక శ్రీసభను విశ్వసించు చున్నాను. పాప విమోచనము నొసగు ఒకే జ్ఞానస్నానము అంగీకరించుచున్నాను. మృతుల ఉత్తానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమెన్


Holydivine