Prayers

విశాఖపురి మేరీమాత నవదిన జపము

గురువు - పిత,పుత్ర,పవిత్రాత్మ నామమున
అందరు - ఆమెన్.
గు - ఓ మరియమ్మ ! పరిపూర్ణ సౌందర్యవతీ
అం - నన్ను దేవునికి ప్రియమగునట్లు చేయుము
గు - జన్మ పాపము లేనివారా !
అం - నన్ను పాపము నుండి కాపాడండి.
గు - మోక్షము యొక్క మహిమా !
అం - నన్ను పరలోకమున జేర సహాయము చేయండి.
గు - కష్టపడు వారికి సంతోషము నొసంగువారా !
అం - మాకు ఆనందమును సమాధానమును దయచేయండి.
గు - పాపాత్ములకు శరమునొసంగు వారా !
అం - నన్ను దేవకోపాగ్నినుండి కాపాడండి.
గు - వివేకముగల కన్యకా దయగలమాత !
అం - మా కొరకు మీ దివ్య కుమారుని ప్రార్ధించండి.


ప్రార్ధించుదము

కన్యమరియమ్మ యొక్క / జన్మపాపము లేని / యుద్భవము వలన / తన ప్రియకుమారునికి / తగిన నివాసమర్పించిన సర్వేశ్వరా ! తమ కుమారుని మరణమును బట్టి / ఆ యమ్మను / ఎలాంటి పాప దోషములు లేకుండా కాపాడిన వారా ! ఆమె మనవుల
ద్వారా మేమును పాపదోషము లేక పరిశుద్ధులుగా మిమ్మును చేర / చిత్తగింప వలయునని / ప్రార్ధించు చున్నాము .

జన్మపాపము లేక యుద్భవించిన / మిక్కిలి పావన మరియమ్మా ! పాపులమైన మేము / ఈ దినము మీ శరణుగోరి వచ్చియున్నాము. / మీ నిర్మలోద్బవమును పొగడుటకు / నిండు హృదయముతో / మీ యెదుట మోకరించి యున్నాము. / తల్లి గర్భములో బడిన ఘడియ నుండి / మీరు పాపమలినము నుండి తప్పించబడి / శ్రీ జేసుని తల్లిగా నుండ పాత్రురాలైరి .

పిచాచి మాయాపాయములను అణగత్రొక్కిన / ఓ మరియమాంబా ! మీ శక్తులన్నియు / మీ కుమారుని రక్షణ కార్యములతో / మిళితమై యున్నందున / ప్రత్యేకముగా దేవునిచే నియమించబడిన / సహకారిణి వనియు / మధ్యవర్థివనియు / మానవ జాతి పేరిట / మిమ్ము ఘనముగా పొగడుచున్నాము . (మంగళవార్త జపము )

మిక్కిలి మధురముగల కన్యకా ! మీ నిష్కలంక హృదయము ద్వారా / సకల దేవవరములు / మానవ జాతిపై కురిపించ బడుచున్నందున / మానవ జాతి పేరట / మీ ద్వారా మీ కుమారుకి / కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచు / మీ శరణుజొచ్చియున్నాము . /
ఈ నవదిన జపములో / మేముకోరు మనవులను / మీ కుమారుని నుండి / అనుగ్రహింప వేడుచున్నాము . (కోరికలు తెల్పుము )

ఓ దయగల మాతా ! / మిమ్ము కొనియాడు / ఈ సమయమున / మీ వేడుదలయందు / మాకుగల నమ్మకమును దృఢపరచి / మేము శోధనలను లోబడకుండ / మీ దివ్య కుమారుని వేడుకొనండి .

ఓ దివ్య జననీ ! / దైవాజ్ఞలను పాటించు / స్దిరమైన మనస్సును / పూర్ణమనస్తాపమును / ఎల్లప్పుడు శోధనలను జయించు వరమును / దేవ ఇష్ట ప్రసాదములో మరణించు అనుగ్రహమును / మాకు దయచేయండి . / మేము కలకాలము / మీతో మోక్షానందము పొందుటకు / మిమ్ము దీన భావముతో వేడుచున్నాము . ( మంగళవార్త జపము )


గురువు : ఓ పరిశుద్ధ మరియమ్మ !

సర్వాధికారముగల రాజ్ఞీ ! మీ పవిత్ర సంరక్షణమునకు / దయకును / నేను ఇప్పుడును . /ఎల్లప్పుడును . / నా మరణ సమయమందు / నా యాత్మ శరీరములను / మీకు సమర్పించుచున్నాను . / నా యాశలను / ఆనందమును , నా చింతలను / నా కష్టములను , జీవమును / నా యంత్య ఘడియను / మీకు సమర్పించుచున్నాను . / మీ యొక్క మిక్కిలి / పవిత్ర మధ్యస్థము ద్వారాను / యోగ్యతలను / నా పనులన్నియు / మీ యొక్కయు / మీ ప్రియ కుమారుని యొక్కయు / దివ్య చిత్తప్రకారము / నడిపించునట్లు / పరిపాలించండి . ఆమెన్ .

ఓ సమాధానము యొక్క రాజ్ఞీ ! దైవారాజ్య విజయమును / మేము గోరు శాంతిని / దేవుని యొక్క సత్యమును / నీతిని / ప్రేమయును సర్వదేశములలోను / సకల మానవుల హృదయములందును / శాంతి సమాధానములను దయచేయండి . ఆమెన్ . (మంగళవార్త జపము ).

Holydivine