6 అవి కొండలలోని క్రూరపక్షులకును భూమిమీదనున్న మృగములకును విడువబడును వేసవికాలమున క్రూరపక్షులును శీతకాలమున భూమి మీదనున్న మృగములును వాటిని తినును.
7 ఆ కాలమున ఎత్తయినవారును నునుపైనచర్మముగల వారును. దూరములోనున్న భీకరమైనవారును నదులు పారు దేశము గలవారునైయున్న దౌష్టికులగు ఆ జనులు సైన్యములకధిపతియగు యెహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాసస్థలముగానుండు సీయోను పర్వతమునకు తేబడుదురు.