Rosary

Joyful Mysteries

1. గాబ్రియేలు సన్మనస్కుడు దేవమాతకు మంగళవార్త చెప్పుట
2. దేవమాత పునీత ఎలిజబేతమ్మను సందర్శించుట
3. ఏసు పుట్టుకను గురించి
4. బాలఏసు దేవాలయములో కానుకగా ఒప్పగింపబడుట
5. దేవమాత కానకబోయిన బాలేసును దేవాలయములో కనుగొనుట

Sign of the Cross

పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున, ఆమెన్.

Apostles Creed

పరలోకమును, భూలోకమును సృష్టించిన
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను.
అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాధుడునైన
యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను.
ఇతడు పవిత్రాత్మ వలన గర్భవతి అయిన కన్య మరియమ్మ నుండి పుట్టెను.
పో౦స్యు పిలాతుని అధికారమునకు లోనై, పాటుబడి, స్లీవ మీద
కొట్టబడి, మరణము పొంది, సమాధిలో ఉ౦చబడెను.
పాతాళమునకు దిగి, మూడవనాడు చనిపోయిన వారలలో నుండి లేచెను.
పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన
సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చొని ఉన్నాడు.
అక్కడనుండి జీవించువారలకును, చనిపోయినవారలకును
తీర్పు చేయుటకు వచ్చును.
పవిత్రాత్మను విశ్వసించుచున్నాను.
పరిశుద్ధ కతోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును
విశ్వసించుచున్నాను.
పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను.
శరీరము యొక్క ఉత్ధానమును విశ్వసించుచున్నాను.
నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్.

Our Father

పరలోకమందు౦డెడు మా యొక్క తండ్రీ!
మీ నామము పూజి౦పబడునుగాక!
మీ రాజ్యము వచ్చునుగాక!
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు
భూలోకమందును నెరవేరును గాక.
నానాటికి కావలసిన మా అన్నము
మాకు నేటికి ఇవ్వండి.
మా యొద్ద అప్పుబడినవారిని మేము మన్నించునట్లు
మా అప్పులను మీరు మన్ని౦చండి .
మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్.

Hail Mary

దేవర వరప్రసాదము చేత నిండిన మరియమ్మా! వందనము.
ఏలినవారు మీతో ఉన్నారు.
స్త్రీలలో అశీర్వది౦పబడినవారు మీరే.
మీ గర్భఫలమగు యేసు అశీర్వది౦పబడినవారు అగునే
పరిశుద్ధ మరియమ్మా! సర్వేశ్వరుని యొక్క మాతా!
పాపాత్ములమై యుండెడు మా కొరకు
ఇప్పుడును, మా మరణ సమయమందును ప్రార్ధించండి. ఆమెన్.

Glory Be

పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ
ఆదిలోవలె ఇప్పుడును, ఎల్లప్పుడును కలుగునుగాక! ఆమెన్.

Oh My Jesus

ఓ నా యేసువా! మా పాపాలు మన్నించండి.
మమ్ము నరకాగ్ని నుండి కాపాడండి.
ఆత్మలన్నిటినీ, ముఖ్యముగా మీ కృప అత్యవసరమైనవాటిని
మోక్షమునకు తీసికొని పొండి. ఆమెన్.

Hail Holy Queen

Final Prayer

Daily Refelections

Holydivine